News December 21, 2025
డైట్ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్

కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించి రాత్రి భోజనం వసతిని పరిశీలించారు. వంట గదికి వెళ్లి రాత్రి భోజనానికి సంబంధించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించారా, సన్నబియ్యం నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. కామన్ డైట్ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.
Similar News
News February 21, 2026
కర్నూలు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

ఫేస్‌బుక్ పరిచయంతో మహిళపై వ్యామోహం పెంచుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పత్తికొండలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన అశోక్(26)కు పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని నమ్మబలికిన యువకుడు పత్తికొండకు వచ్చాడు. అనంతరం తనతో రావాలంటూ మహిళను వేధించగా ఆమె నిరాకరించడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
News February 21, 2026
ప.గో: ఉగాది గిఫ్ట్.. మరో DSC నోటిఫికేషన్!

ఉగాది వేళ డీఎస్సీ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 900 పైచిలుకు పోస్టులు భర్తీ కాగా, తాజాగా మరో 200 ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతో ఉపాధ్యాయ కొలువే లక్ష్యంగా ఉమ్మడి ప.గో. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెడుతున్నారు.
News February 21, 2026
నల్లగొండ: 14 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

నల్లగొండ 5వ జోన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. నల్లగొండ, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సంతోష్ సూచించారు.


