News January 28, 2025
డోన్ ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

డోన్(M) గుమ్మకొండకు చెందిన శివ ప్రసాద్(19) సూసైడ్ చేసుకున్నాడు. యువకుడు తిరుపతి సమీపంలో ఉన్న SVC ఇంజినీరింగ్ కళాశాలలో CEC చదువుతూ ఓ PG హాస్టల్లో ఉంటున్నాడు. గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ యజమాని ఫిర్యాదు మేరకు తిరుచానూరు CI సునీల్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం SV మెడికల్ కళాశాలకు తరలించారు.
Similar News
News February 24, 2026
NRPT: ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలపై సీఎస్ సమీక్ష..!

రాష్ట్రంలో SSC, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు.
News February 24, 2026
శిఖర్ ధవన్‌కు బిగ్ రిలీఫ్

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ఊరటనిచ్చింది. భరణంగా ధవన్ ఇచ్చిన దాదాపు ₹5.72కోట్లను తిరిగిచ్చేయాలని మాజీ భార్య ఆయేషా ముఖర్జీని ఆదేశించింది. ‘ప్రాపర్టీ సెటిల్‌మెంట్’ కింద ఆ మొత్తం చెల్లించమని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అది భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. కాగా ఈనెల 21న <<19203658>>ధవన్<<>> సోఫీ షైన్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
News February 24, 2026
NRPT: ‘వారం రోజుల్లో 80 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలి’

జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతీ ఇంటికి వెళ్లి కచ్చితమైన ఓటరు గుర్తింపుతో ప్రోసిడింగ్ మ్యాపింగ్, ఎలక్టోరల్ మ్యాపింగ్ చేపట్టాలని వారం రోజుల్లో ఈ ప్రక్రియను 80 శాతం పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఎస్ఐఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటరు నమోదు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు.


