News January 15, 2026

డోన్: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

డోన్ మం. దొరపల్లె రైల్వే గేట్ సమీపంలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు చిట్యాలకు చెందిన తలారి మధుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 21, 2026

పలమనేరు: నకిలీ బిల్లుల సృష్టి కర్తలు వీళ్లే..!

image

<<19204252>>నకిలీ బిల్లుల<<>> వ్యవహారంలో APO రవికుమార్, టెక్నికల్ అసిస్టెంట్ ఉషశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలమనేరులోని అంబేడ్కర్ నగర్ బసాపురం పోస్టాఫీస్‌లో వారం రోజుల వ్యవధిలో 100కు పైగా అకౌంట్లు ఓపెన్ చేశారని ప్రాథమిక సమాచారం. ముందు చేసిన పనులకు బిల్లు పెట్టినట్లు కొన్ని, డమ్మీ మస్టర్ క్రింద మరి కొన్ని బిల్లులు పెట్టినట్లు సమాచారం.

News February 21, 2026

BREAKING: పాలమూరు: విషాదం.. యువకుడు సూసైడ్

image

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మార్చాలకు చెందిన సాయిప్రసాద్ (23) కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడు స్వగ్రామానికి వచ్చాడు. ఈరోజు గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 21, 2026

ధర్మపురి: ‘బ్రహ్మోత్సవాలు జిల్లాకు ప్రతిష్ఠాత్మకం’

image

ధర్మపురిలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జిల్లాకు ప్రతిష్ఠాత్మకమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఈసారి భక్తుల రద్దీ గతేడాదితో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్ల నిర్వహణ పక్కాగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నదాన కేంద్రాలు, సూచిక బోర్డులు, చలువ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు.