News November 27, 2024
డోన్ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫారం సమీపంలో మృతదేహం

డోన్ రైల్వే స్టేషన్ 4f ఫ్లాట్‌ఫారం సమీపంలో యువకుని(23) మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్యాపిలి మండలం రాచర్లకు చెందిన యువకుడిగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం జీఆర్‌పీ ఎస్ఐ 9030481295ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 15, 2026
ప్రేమ విఫలం.. ఆళ్లగడ్డలో యువకుడి సూసైడ్?

ఆళ్లగడ్డలోని పుల్లారెడ్డి వీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ జీవిస్తున్న రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయను సయామి(25) ఇంట్లో ఉరివేసుకొని అనుమానాదాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలమై ఉరివేసుకొన్నట్లు భావిస్తున్నారు.
News February 15, 2026
రేపు కర్నూలు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీల పరిష్కారం సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి కనుక్కోవచ్చని పేర్కొన్నారు. Meekosam.ap.gov.in అర్జీలు నమోదు చేసుకోవాలన్నారు.
News February 15, 2026
కర్నూలు: నీటి కుంటలో పడి 12 ఏళ్ల బాలుడి మృతి

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ఉత్సాహంతో వెళ్లిన యాత్ర విషాదంగా ముగిసింది. ఆలూరు మండలం తుంబలబీడుకు చెందిన సలువప్ప చిన్న కుమారుడు ఎం.సిద్ధార్థ(12) శివరాత్రి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ ప్రధాన రహదారి పక్కన ఉన్న నీటి కుంటలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


