News February 9, 2025
డోన్: విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి

కూలి పనుల కోసం రేకుల షెడ్డు నిర్మాణానికి వెళ్లిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన విషాదకర సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. సుందర్ సింగ్ కాలనీకి చెందిన ఖాజాబాషా(32) కొత్తపల్లి గ్రామ సమీపంలో రేకుల షెడ్డు నిర్మాణానికి కూలి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా పైభాగంలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.
Similar News
News November 6, 2025
ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంటే ఈ ఆహారం తీసుకోండి

ప్రస్తుతం కాలంలో మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డయాబెటీస్. దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. దీంతో బాధపడే వారు ఫైబర్ రిచ్ ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. అవకాడో, డ్రైఫ్రూట్స్, నట్స్, బ్రోకలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, టోఫు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.
News November 6, 2025
కార్తీక మాసం.. ధర్వేశిపురం ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు

కార్తీక మాసం గురువారం సందర్భంగా నల్గొండ(D) కనగల్(M) ధర్వేశిపురం గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దయతో అందరికీ సర్వమంగళం కలగాలని భక్తులు ప్రార్థించారు.
News November 6, 2025
నెల్లూరు జిల్లా విభజన ఇలా..!

మరోసారి నెల్లూరు జిల్లా విభజన జరగనుంది. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు నెల్లూరులోకి రానుంది. విడవలూరు, కొడవలూరును కావలి నుంచి నెల్లూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. కలువాయి, రాపూరు, సైదాపురం గూడూరు డివిజన్‌లోకి, వరికుంటపాడు, కొండాపురం జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, ఉదయగిరిని కావలి డివిజన్‌లోకి మార్చేలా ప్రతిపాదనలు చేశారు.


