News February 1, 2025
డోర్నకల్: అమల్లోకి ఎన్నికల కోడ్, ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగింపు

రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా డోర్నకల్ మున్సిపాలిటీలోని వివిధ పార్టీల జెండాలను, బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎవరు ఫ్లెక్సీలు బ్యానర్లు అంటించవద్దని మున్సిపల్ కమీషనర్ తెలియజేశారు.
Similar News
News February 2, 2026
ఈ పంటలకు నారు పెంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి

తీగజాతి కూరగాయలు అయినటువంటి చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి వీటిని నారుగా కాకుండా విత్తనాలను నేరుగా పొలంలోనే విత్తుకోవచ్చు. టమాట, వంగ, క్యాబేజి, కాలిఫ్లవర్, మిరప, ఉల్లి లాంటి పంటలలో విత్తన పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే వీటిని ముందుగా నారుమడులలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నారును నాటుకోవాల్సి ఉంటుంది.
News February 2, 2026
అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.
News February 2, 2026
నంద్యాల: శిల్పి చెక్కిన శిల్పిం.. సోనియాకు గ్రూప్-2 జాబ్

ఆళ్లగడ్డ గీతా వీధికి చెందిన షేక్ బాషా, మాబ్బీ దంపతుల కుమార్తె సోనియా గ్రూప్-2కు ఎంపికయ్యారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ సహాయకురాలిగా ఉద్యోగం సాధించారు. తండ్రి షేక్ బాషా శిల్పి. తమ బిడ్డకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. మహా సాయి శిల్పా కళామందిరం నిర్వాహకులు అభినందనలు తెలిపారు.


