News February 6, 2026

డోర్నకల్‌ ఎన్నికల కోఆర్డినేటర్‌గా గాజర్ల అశోక్‌

image

డోర్నకల్‌ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తగా టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్‌ నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో అశోక్ సమర్థవంతంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేసినందుకు గుర్తింపుగా ఈ బాధ్యతలు అప్పగించారు.

Similar News

News February 7, 2026

చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి: YCP

image

CBN హయాంలోనే తిరుమలలో కల్తీ నెయ్యి జరిగిందని YCP ఆరోపించింది. ‘చంద్రబాబు CM అయ్యాక నాణ్యత లేదని TTD 4 నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్‌ చేసింది. అవే మరో పేరుతో చంద్రబాబు CMగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వస్తే TTD ఆమోదించింది. వాటినే లడ్డూ తయారీకి వాడారని స్వయంగా CBI వెల్లడించింది. CBN ప్రభుత్వం చేసిన తప్పులు, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్‌షీట్‌లో రాసింది. మరి ఈ పాపాలు ఎవరివి బాబూ?’ అంటూ ట్వీట్ చేసింది.

News February 7, 2026

అనంతపురానికి కార్పొరేట్ సంస్థల క్యూ: ఎమ్మెల్యే ప్రసాద్

image

అనంతపురం నగరానికి కార్పొరేట్ సంస్థలు క్యూ కడుతున్నాయని MLA దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. శనివారం సుభాష్ రోడ్డులో ఓ జువెలరీ మాల్‌ను ‘రాజాసాబ్’ హీరోయిన్ మాళవిక మోహన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహానగరాల స్థాయిలో అనంతపురం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. నగరానికి వచ్చే పెట్టుబడిదారులకు ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

News February 7, 2026

పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న AP SEC

image

AP: పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రాథమిక ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. పంచాయతీ వార్డుల వారీగా ఫొటో ఓటర్ ఐడీ కార్డుల జాబితా సిద్ధం చేయాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది. 2026 జనవరి 1వ తేదీని కటాఫ్‌గా చేసుకొని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వీటిని రూపొందించాలని సూచించింది. మార్చి 9న వీటిని పబ్లిష్ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొంది.