News January 7, 2026

డోర్నకల్ ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకరా.. క్యాబినెట్‌లోకా?

image

డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.రాంచంద్రు నాయక్‌ను రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు రెండు సార్లు జరిగాయి. డిప్యూటీ స్పీకర్ పై అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేయకపోవడంతో గిరిజన ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌ను క్యాబినెట్లో తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. CM రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే బుధవారం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.

Similar News

News January 23, 2026

అనంతపురం JNTU విద్యార్థులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో Accenture కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురికి రూ.6.5 లక్షలు, ఐదుగురికి రూ.4.5లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను VC సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించడంపై కళాశాలలో హర్షం వ్యక్తమైంది.

News January 23, 2026

బాపట్ల: రూ.102 కోట్లతో 260 కొత్త ఆరోగ్య కేంద్రాలు

image

బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు రూ.102.336 కోట్లతో 260 కొత్త ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఆమోదం లభించిందని గురువారం MP కృష్ణప్రసాద్ తెలిపారు. మంజూరైన వాటిలో 234 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 18 బ్లాక్ హెల్త్ యూనిట్లు, 5 పీహెచ్‌సీలు, 1 క్రిటికల్ కేర్ బ్లాక్ ఉన్నాయని వివరించారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యమని వెల్లడించారు.

News January 23, 2026

బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

image

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.