News February 24, 2025
డోర్నకల్: మార్గం మధ్యలో గుండెపోటుతో వ్యక్తి మృతి

డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో నల్ల ప్రభాకర్ (43) గుండెపోటుతో మృతి చెందాడు. కడుపు నొప్పి రావడంతో.. ఖమ్మంలో ఓ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
Similar News
News February 24, 2025
గవర్నర్‌కు ఎర్రగొండపాలెం MLA కౌంటర్

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు పేరును తప్పుగా ఉచ్ఛరించారు. దీనిపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ‘నరేంద్ర పవన్ చంద్రబాబు నాయుడు అని చదివితే బాగుండేది. కూటమి ధర్మం కూడా నిలబడేది’ అంటూ Xలో పోస్ట్ చేశారు.
News February 24, 2025
వంశీపై పీటీ వారెంట్

AP: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. రేపటితో రిమాండ్ ముగియనుండటంతో సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయనపై మరిన్ని పాత కేసులను ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కస్టడీలో ఉన్న వ్యక్తిపై మరో కేసు నమోదు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు పీటీ వారెంట్ జారీ చేస్తారు.
News February 24, 2025
కోహ్లీ సెంచరీ.. అనుష్క శర్మ ❤️ పోస్ట్ వైరల్

పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేసి జట్టును గెలిపించడమే కాకుండా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను టీవీలో చూసిన అనుష్క శర్మ భర్త కోహ్లీని ఫొటో తీసి హైఫై, లవ్ సింబల్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు మ్యాచ్‌ను గెలిపించాక విరాట్ మెడలోని చైన్‌కు ఉన్న వెడ్డింగ్ రింగ్‌కు ముద్దుపెట్టారు. దీనికి రిప్లైగా అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.