News August 13, 2025
డోర్నకల్ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

డోర్నకల్ మీదుగా నడిచే పలు రైళ్లను ట్రాక్ మరమ్మతులు, మెయింటినెన్స్ కారణంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో DKJ-VIJ (67767), VIJ-DKJ (67768), VIJ-SEC (12713), VIJ-BCM(67215), GUNTOR-SEC(12705), SEC-GUNTR(12706) రైళ్లు ఉన్నాయి. ఈనెల 14 నుంచి 5 రోజుల పాటు రద్దు వర్తిస్తుందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
Similar News
News August 14, 2025
మన్యం: చెరువులా..? కార్యాలయాలా..?

పార్వతీపురంలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడటంతో జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంతం వర్షపు నీటితో నిండి చెరువులను తలపించింది. ఈ కార్యాలయం నుంచి తిరంగా ర్యాలీ తలపెట్టడంతో ఇక్కడకి వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా అధికారులు అందరూ ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తున్నా నడిచే దారిని బాగు చేసుకోలేని స్థితిలో ఉన్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
News August 14, 2025
ఆపరేషన్ సింధూర్ విజయం.. పెద్దపల్లిలో తిరంగా యాత్ర

జమ్మూకాశ్మీర్ పహాల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతసైన్యం విజయవంతంగా పూర్తిచేసిన ఆపరేషన్ సింధూర్‌ను జాతి విజయంగా జరుపుకుంటూ PDPLలో BJP తిరంగయాత్ర నిర్వహించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో పాల్గొని మోదీ ప్రభుత్వ నిబద్ధతను ప్రజలకు వివరించారు.
News August 14, 2025
యాదగిరి శ్రీవారి నిత్య ఆదాయం ఎంతంటే?

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, యాదరుషి నిలయం కళ్యాణకట్ట, వ్రతాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.15,69,845 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.