News March 5, 2025
డ్యూ బాల్ ప్రధాన కార్యదర్శిగా నల్లమల క్రీడాకారుడు

రాష్ట్ర డ్యూ బాల్ ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట మండలం దేవులపాడుకు చెందిన సభవత్ బాబు నాయక్‌ను నియమించినట్లు డ్యూ బాల్ ఇండియా అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డ్యూ బాల్ క్రీడను విస్తరించి, క్రీడాకారులు రాణించేలా కృషి చేస్తానన్నారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని చెప్పారు.
Similar News
News January 1, 2026
ఖమ్మం: నేటి నుంచి ‘ఆపరేషన్ స్మైల్-12’

ఖమ్మం జిల్లాలో అనాథలు, బాల కార్మికులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు నేటి నుంచి ‘ఆపరేషన్ స్మైల్’ 12వ విడత ప్రారంభం కానుంది. పోలీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈనెల 30 వరకు తనిఖీలు నిర్వహిస్తారు. పరిశ్రమలు, దుకాణాలు, ఇటుక బట్టీల్లో పని చేసే బాలలను గుర్తించి వారికి కౌన్సెలింగ్, రక్షణ కల్పిస్తామని జిల్లా అధికారి వేల్పుల విజేత తెలిపారు. బాల్యవివాహాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.
News January 1, 2026
బాల భీముడు పుట్టాడు.. అదీ నార్మల్ డెలివరీ..

AP: అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ ఏకంగా 4.8 కేజీల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. అది కూడా నార్మల్ డెలివరీ కావడం విశేషం. పెందుర్తికి చెందిన మహిళకు సాధారణ ప్రసవంలో శిశువు తల మామూలుగానే బయటకు వచ్చినా భుజాలు రాకపోవడంతో సిజేరియన్ తప్పదేమోనని భావించారు. కానీ వైద్యులు 4 గంటల పాటు శ్రమించి సాధారణ కాన్పు చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లను మంత్రి సత్యకుమార్ అభినందించారు.
News January 1, 2026
పాడేరులో జిల్లా స్థాయి నూతన సంవత్సరం వేడుకలు

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం–2026 వేడుకలు నేడు పాడేరులో నిర్వహించనున్నారు. ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. (మనివా గ్రిల్స్ రెస్టారెంట్ ఎదురుగా) వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు హాజరుకావాలని జిల్లా యంత్రాంగం కోరింది.


