News April 12, 2025

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన కాజీపేట పోలీసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణతో నేరస్థులను గుర్తించడంలో భాగంగా కాజీపేట్ ఎస్ఐ లవణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బంధం చెరువు ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని ఎస్‌ఐ వాహనదారులను హెచ్చరించారు.

Similar News

News February 12, 2026

దోసలో బోరాన్ లోప లక్షణాలను ఇలా గుర్తించండి

image

దోస పంటలో బోరాన్ లోపం వల్ల ఆకులు మందంగా మారతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి, ఆకులు చిన్నవిగా, ముడుచుకొని, పసుపు రంగులో కనిపిస్తాయి. ఎదిగే లేత కొనలు ఎండిపోతాయి. ఆడ పువ్వుల సంఖ్య తగ్గి మగ పువ్వుల సంఖ్య పెరుగుతుంది. కాయ లోపలి భాగం లేత పసుపురంగులోకి మారుతుంది. కాయలపైన తొక్క దళసరిగా మందంగా మారడంతో పాటు బొడిపెలు కనిపిస్తాయి. బోరాన్ లోప ఉద్ధృతి ఎక్కువైతే కాయలు నిలువుగా పగులుతాయి.

News February 12, 2026

ఆధార్‌లో ఇంటి అడ్రస్‌ను ఈజీగా మార్చుకోండి!

image

ఇల్లు మారినప్పుడల్లా అడ్రస్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. ఆధార్ మొబైల్ <<18981041>>యాప్<<>> ద్వారా మీ హౌస్ అడ్రస్‌ను సులభంగా మార్చుకోవచ్చు. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే సరిపోతుంది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే సులభంగా, వేగంగా ఈ సేవను పొందొచ్చు. యూజర్లు ₹75+GST చెల్లించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. SHARE IT

News February 12, 2026

శని త్రయోదశి ప్రత్యేక పూజ

image

కెరీర్‌లో సమస్యలా? ఏ పని దిగ్విజయంగా పూర్తి చేయలేకపోతున్నారా? అయితే మీకు శని త్రయోదశి పూజ సరైంది. శని త్రయోదశి రోజున నిర్వహించే ఈ ప్రత్యేక పూజ మీ శని దోషాలను తగ్గించడమే కాకుండా జీవితంలో సత్ఫలితాలను ఇస్తుంది. తైలాభిషేకంతో కూడిన అర్చనతో శని దేవుడి అనుగ్రహం కూడా పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో నిర్వహించే పూజ పూర్తి వీడియో రికార్డింగ్‌ను 24 గంటల్లో మీకు పంపిస్తాం. వేదమందిర్‌లో ఇప్పుడే <>బుక్ చేసుకోండి<<>>.