News September 9, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్.. ముగ్గురికి జైలు, 106 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కామారెడ్డి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరికి, దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి న్యాయస్థానం ఒకరోజు జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధించింది. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 106 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి రూ. 67,200 జరిమానా విధించినట్లు పోలీసు కార్యాలయం మంగళవారం పేర్కొంది.
Similar News
News April 5, 2026
ADB: సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజావాణి రద్దు

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 6న రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదుదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని, ఈ మార్పును గమనించి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News April 5, 2026
రేవల్లి: 9న గొల్లపల్లి- చీర్కపల్లికి హరీష్ రావు రాక

రేవల్లి మండలంలోని గొల్లపల్లి- చిర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాట సమితి దీక్షలకు సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రి హరీశ్ రావు రానున్నారని చెప్పారు. ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ప్రభుత్వం ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
News April 5, 2026
8న చెరువుగట్టు ఆలయ టెండర్ల వేలం

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన వివిధ టెండర్ల బహిరంగ వేలం ఈనెల 8న (బుధవారం) జరగనుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు గట్టుపై ఉన్న ఈవో కార్యాలయం వద్ద వేలం నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 వరకు వర్తించే ఈ వేలం ప్రక్రియలో ఆసక్తి గలవారు పాల్గొనాలని ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.


