News December 27, 2025
డ్రగ్స్ కేసు ఆడియో, వీడియో సాక్ష్యాలన్నీ ఏమయ్యాయి?: బండి

TG: డ్రగ్స్ కేసు KTRకు చుట్టుకొని రాజకీయ జీవితం నాశనం అయ్యేలా ఉండడంతో నాటి CM KCR నీరుగార్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘పట్టుబడిన సెలబ్రిటీలు, ఇతరులు KTR డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పారు. ఆడియో, వీడియో సాక్ష్యాలతో SIT చీఫ్ అకున్ నివేదిక ఇచ్చారు. వాటిని నాటి CS సోమేశ్ తీసుకున్నారు. అవి ఏమయ్యాయి? సోమేశ్‌ను విచారించాలి. కేసును మళ్లీ అకున్‌కు అప్పగించాలి’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News January 11, 2026
పోలవరం స్పిల్‌వేకు ద్రవిడియన్ తోరణాలు!

AP: పోలవరం తొలిదశను 2027 ఉగాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు గతంలో అనుకున్న జూన్ లక్ష్యాన్ని మార్చి నాటికి కుదించాలని అధికారులకు ఆదేశించారు. దీనికి నిర్మాణ సంస్థ మేఘా సైతం అంగీకరించింది. ఇదే సమయంలో పోలవరం స్పిల్‌వేను ద్రవిడియన్ శైలిలో ఉన్న తోరణాలతో అలంకరించేందుకు డిజైన్లను సదరు సంస్థ CMకు చూపించింది. వీటిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
News January 11, 2026
ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?

ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం బీటా-కెరోటిన్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది ఆవులు గడ్డి, ఆకుకూరలు తిన్నప్పుడు ఈ బీటా-కెరోటిన్ పాల కొవ్వులో కలిసిపోయి, పాలకి లేత పసుపు రంగునిస్తుంది. ఇది ‘విటమిన్-ఎ’గా మారుతుంది. గేదె పాలలో బీటా-కెరోటిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటాయి. కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలే మంచివి. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలను ఎంచుకుంటే మంచిదట.
News January 11, 2026
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మెన్, సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ(BSW/BA/BCOM), టెన్త్, 7వ తరగతి అర్హత కలిగిన వారు జనవరి 23వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in/


