News November 13, 2024

డ్రగ్స్ నియంత్రణ ఛాలెంజ్‌గా మారింది: SP

image

డ్రగ్స్ నియంత్రణ సమాజానికి పెద్ద ఛాలెంజ్‌గా మారిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. మానవ జీవితాలను మాదకద్రవ్యాలు ఏ విధంగా నాశనం చేస్తాయో వైద్య విద్యార్థులకు తెలియదని అన్నారు. అరెస్టులు కంటే అవగాహనతోనే నిర్మూలించవచ్చునని భావించి యువతలో చైతన్యం తీసుకువస్తున్నామని చెప్పారు. కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయని వివరించారు.

Similar News

News November 14, 2024

నిందితుల వేలిముద్రలను సేకరించండి:SP

image

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలన్నారు. 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అన్ని కేసుల్లో అరెస్టు కాబడిన నిందితుల వేలిముద్రలను లైవ్ స్కానర్లలో తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని ఆదేశించారు.

News November 14, 2024

బూర్జవలస పోలీస్ స్టేషన్ పైకి దూసుకెళ్లిన కంటైనర్

image

దత్తిరాజేరు మండలంలోని బూర్జవలసలో ఓ కంటైనర్ భీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి వాహనం అదుపుతప్పి నేరుగా బూర్జవలస పోలీస్ స్టేషన్‌పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో స్టేషన్ గోడ ధ్వంసం కాగా.. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News November 13, 2024

VZM: కొప్పల వెలమ డైరెక్టర్లుగా నియామకం

image

కొప్పల వెలమ డైరెక్టర్లుగా పలువురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాల వారీగా వివరాలు..
☛ అక్కేన మధుసూదనరావు(కురుపాం)
☛ అల్లు విజయ్ కుమార్(గజపతినగరం)
☛ గొట్టాపు వెంకట నాయుడు(పార్వతీపురం)
☛ కొల్లి అప్పలనాయుడు(బొబ్బిలి)
☛ మిడతాన రవికుమార్(విజయనగరం)
☛ మాకిరెడ్డి శ్రీలక్ష్మి(ఎస్.కోట)
☛ ఎస్.కోటకు చెందిన మల్లా రామకృష్ణను గవర కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.