News November 11, 2025

డ్రగ్స్ నివారణకు భాగస్వాములు కావాలి: ఎస్పీ రోహిత్ రాజు

image

డ్రగ్స్ బారినపడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. మంగళవారం సుజాతనగర్ నుంచి వేపలగడ్డ వరకు ‘డ్రగ్స్ పై యుద్ధం’ పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించారు. గంజాయి రవాణాను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మత్తు పదార్థాల రవాణా గురించి తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రెహమాన్, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

గ్రామీణ యువత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రంగంపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను మంగళవారం కలెక్టర్ కోయ హర్ష ప్రారంభించారు. గ్రామీణ నిరుద్యోగ యువత ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలన్నారు. టైలరింగ్, మగ్గం వర్క్ వంటి రంగాలలో శిక్షణ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపర్ణ రెడ్డి, రాకేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

News November 11, 2025

కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి CBI నోటీసులు

image

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డికి CBI నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈనెల 13, లేదా 15న విచారణకు వస్తానని సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కల్తీకి సంబంధించి సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నిస్తున్నారు.

News November 11, 2025

మరో భారీ ఎన్‌కౌంటర్

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్‌లో భద్రతా బలగాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కీలక మావోయిస్టును బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.