News August 22, 2025

డ్రగ్స్ రహిత జిల్లాగా ఏలూరు: అడిషనల్ ఎస్పీ

image

ఏలూరు జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చాలని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు అన్నారు. ఎస్పీ కె. ప్రతాప్ కిషోర్ ఆదేశాల మేరకు, వట్లూరులోని సి.ఆర్.ఆర్. రెడ్డి కళాశాలలో ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, శక్తి టీమ్‌తో కలిసి “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి భవిష్యత్తును నాశనం చేస్తాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Similar News

News April 8, 2026

IPL: గిల్ రీఎంట్రీ.. GT బోణీ కొడుతుందా?

image

ఐపీఎల్‌లో ఈరోజు ఢిల్లీ వేదికగా DC, GT రా.7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో DC ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫామ్‌లో ఉండగా, GT ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో ఈరోజైనా గెలిచి ఆ జట్టు బోణీ కొడుతుందేమో చూడాలి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, GT 4 విజయాలతో పైచేయి సాధించింది. కండరాల నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన గుజరాత్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచులో ఆడనున్నారు.

News April 8, 2026

చిన్న వెంకన్న ఆలయ అక్రమాలపై రాజకీయ ఒత్తిళ్లు!

image

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నకిలీ టికెట్ల కుంభకోణం కలకలం రేపుతోంది. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోగా విచారణలో మరిన్ని పేర్లు బయటపడ్డాయి. అయితే, నిందితులను కాపాడేందుకు రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు సమాచారం. కొందరిపైనే కేసులు పెట్టి, మిగిలినవారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దోషులందరిపై చర్యలు తీసుకుని ఆలయ పవిత్రతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

News April 8, 2026

ఇరాన్‌కు డెడ్‌లైన్ గడువును పొడిగించిన ట్రంప్

image

ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్ గడువును 2 వారాలపాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. <<19594813>>పాక్ అభ్యర్థన<<>> మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేసేందుకు అంగీకరించానన్నారు. ‘హార్ముజ్‌ను వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందన్న షరతుకు లోబడి దీనికి నేను ఒప్పుకున్నా. ఈ సీజ్‌ఫైర్ ఇరువైపులా వర్తిస్తుంది. ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్‌ అందింది. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.