News February 21, 2026

డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: కలెక్టర్

image

జిల్లాలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మూతపడిన కంపెనీలు, మెడికల్ షాపులపై నిఘా ఉంచాలని.. సర్పంచులు, వార్డు సభ్యుల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానిత సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Similar News

News February 21, 2026

స్త్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలి: ఖమ్మం డీఆర్డీవో పీడీ

image

స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలు పెండింగ్ ఉంచకుండా సకాలంలో చెల్లించాలని ఖమ్మం డీఆర్డీవో పీడీ శ్రీరామ్ స్పష్టం చేశారు. గ్రామదీపికల నిర్లక్ష్యం వల్ల వడ్డీ భారం పెరుగుతుందని, అవకతవకలకు తావులేకుండా వసూళ్లు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి, హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

News February 21, 2026

నిర్మల్: గోదావరి నదిలో మహిళ శవం లభ్యం

image

బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆమె మహారాష్ట్ర కర్కేల్లి గ్రామానికి చెందిన మోతేవార్ అనసూయగా గుర్తించారు. బుధవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 21, 2026

నెల్లూరు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

image

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్(26)కు కర్నూలు(D) పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని ఆ దంపతులకు చెప్పాడు. పత్తికొండకు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆమెపైనే కన్నేసిన తనతో రావాలంటూ వేధించగా నిరాకరించింది. దీంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.