News December 20, 2025
డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యం: కలెక్టర్

మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ జాతీయ, రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం కదిరి R&B గెస్ట్ హౌస్ నుంచి మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ చేశారు. కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి యువత ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమన్నారు.
Similar News
News December 26, 2025
తిరుపతి: గతంలో BVSలు ఎక్కడ జరిగాయంటే..?

సంప్రదాయ విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడంతో సమకాలిన సమాజానికి జరిగే మేలును దేశానికి చాటి చెప్పే కార్యక్రమం భారతీయ విజ్ఞాన సమ్మేళనం(BVS). 2007లో భోపాల్‌లో ప్రారంభించారు. 2009లో ఇండోర్, 2012లో జలంధర్, 2015లో పనాజీ, 2017లో పుణే, 2023లో అహ్మదాబాద్‌లో జరిగాయి. తొలిసారి తిరుపతి వేదికగా ఇవాళ BVS నిర్వహించనున్నారు.
News December 26, 2025
యశ్ దయాల్ స్థానంలో ఉమేశ్ యాదవ్?

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB బౌలర్ యశ్ దయాల్ స్థానంలో IND సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను వచ్చే సీజన్‌లో జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. పోక్సో కేసు నమోదైన యశ్‌ను జట్టులో ఎలా కొనసాగిస్తారని RCBపై విమర్శలొస్తున్నాయి. తాజాగా అతని ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో ఉమేశ్‌ను తీసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై RCB నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
News December 26, 2025
సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు: బీసీ జనార్దన్

AP: రాష్ట్రంలోని రోడ్లను సంక్రాంతి నాటికి గుంతల రహితంగా తీర్చిదిద్దాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల ఆర్&బి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో రోడ్ల పరిస్థితి, జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గతేడాది సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన ప్రజలు, స్థానికులు రహదారులు మెరుగుపడటంపై సంతోషం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.


