News March 15, 2026
డ్రగ్స్ వివాదంలో ‘పైలట్ రోహిత్’!

డ్రగ్స్ వినియోగిస్తారనే ఆరోపణలు పైలట్ రోహిత్ రెడ్డిపై వస్తూనే ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ కేసులో బెంగళూర్ పోలీసులు విచారణకు పిలిచారు. ఇప్పుడు తన ఫాంహౌస్‌లోనే డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇదే ఫాంహౌస్ వేదికగా జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ పార్టీకి కూడా ఇదే వేదిక. దీంతో పైలట్‌తో పాటు ఆయన ‘ఫౌంహౌస్’ కూడా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
Similar News
News March 29, 2026
అత్యాచార బాధితుల పేర్లను తీర్పుల్లోనూ వాడరాదు: సుప్రీంకోర్టు

అత్యాచార బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను తీర్పుల్లోనూ ప్రస్తావించరాదని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని గుర్తించే అవకాశమున్న ఏ వివరాలనూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో చెప్పరాదని 2018లోనే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంది. లైంగిక నేరాల బాధితులకు సమాజంలో ఇబ్బందులు కలగకుండా ఇలా చేసినట్లు పేర్కొంది. ఓ బాలిక వివరాలను HP హైకోర్టు ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది.
News March 29, 2026
సూర్యాపేట: సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాలు

సూర్యాపేట జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఫారెన్ సర్వీసు కింద పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. ఇన్-సర్వీస్‌లో ఉన్న అర్హులైన GHM, SAల నుంచి ప్లానింగ్ కోఆర్డినేటర్, ఇన్‌క్లూజివ్ కోఆర్డినేటర్ పోస్టులకు అప్లికేషన్లు కోరుతున్నారు. గతంలో ఈ పోస్టుల్లో పనిచేసిన వారి కాలపరిమితి ముగియడంతో కొత్త వారిని ఎంపిక చేస్తున్నట్లు, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 29, 2026
ADB: పంట మార్పిడితోనే పసిడి దిగుబడులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంట మార్పిడిపై వ్యవసాయ శాఖ ముమ్మరంగా అవగాహన కల్పిస్తోంది. ఏటా ఒకే పంట వేయడం వల్ల నేల నిస్సారమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పంటలు మార్చడం ద్వారా భూసారం పెరిగి, పురుగులు, తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుందని వివరించారు. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గి, స్థిరమైన ఆదాయం లభిస్తుందని, రైతులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత సాధించవచ్చని సూచిస్తున్నారు.


