News February 16, 2025
డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారికి ఫైన్ వేయండి: కలెక్టర్

విశాఖ నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారిని గమనించి అపరాద రుసుములను వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ప్లానింగ్ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 12, 2026
విశాఖలో మురికివాడల అభివృద్ధే లక్ష్యం

విశాఖలో మురికివాడల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో మెరుగైన ర్యాంక్ లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. RKబీచ్-రుషికొండ వరకు 6 సులభ్ కాంప్లెక్స్‌లు.. వెలంపేట, ఇందిరానగర్‌లో పైలట్ ప్రాజెక్టుల కింద గృహ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
News February 12, 2026
ఆస్తిపన్ను బకాయిదారులపై GVMC కఠిన చర్యలు..

GVMC పరిధిలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల వసూళ్ల విషయంలో GVMC కఠినంగా వ్యవహారిస్తోంది. 2025-26 సంవత్సరానికి రూ.566 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.360 కోట్లు వసూలయ్యాయి. 6 లక్షలకు పైగా మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు. చెల్లింపులు లేకపోతే ఆస్తుల సీజ్‌కు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 60 వేల మందికి నోటీసులు పంపగా.. మరో 20 వేల మందికి కుళాయి కనెక్షన్లు కట్ చేసేందుకి రెడీ అవుతున్నారు.
News February 11, 2026
విశాఖ హోటళ్లకు పోలీస్ కమిషనర్ కీలక ఆదేశాలు

మిలాన్, ఐఎఫ్ఆర్ వంటి ప్రతిష్టాత్మక సదస్సుల నేపథ్యంలో సీపీ శంఖబ్రత బాగ్చి హోటల్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. హోటళ్లలో DFMD, HHMD తనిఖీలు, CCTV నిఘా పెంచాలని ఆదేశించారు. అతిథుల ఐడీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సిబ్బంది వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. VVIPల భద్రతలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు


