News November 11, 2025
డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.
Similar News
News February 20, 2026
16 శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే..

సంతోషీ మాత వ్రతాన్నే ‘16 శుక్రవారాల వ్రతం’ అంటారు. ఈ వ్రతం చేస్తే అద్భుత మార్పులుంటాయని నమ్మకం. ‘మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి, ధనప్రాప్తి కలుగుతుంది. వివాహం యోగం లేనివారికి మంచి ఫలితాలుంటాయి. దంపతుల మధ్య కలహాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యాలు దూరమవుతాయి. ఇల్లు సుఖసంతోషాలతో, ధనదాన్యాలతో విరాజిల్లుతుంది’ అని పండితులు చెబుతున్నారు.
News February 20, 2026
పుచ్చ పంటలో పండు ఈగను ఎలా నివారించాలి?

పుచ్చ పంటలో పండు ఈగ తల్లి పురుగులు పూమొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలిచి లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. కాయలు వంకర్లు తిరిగి కుళ్లిపోతాయి. వీటి నివారణకు క్యూల్యూర్ అనే పండు ఈగ ఆకర్షణ బుట్టలు ఎకరానికి 10 నుంచి 20 చొప్పున పంటకాలం మొత్తం అమర్చుకోవాలి. తీవ్రతను బట్టి లీటరు నీటికి మలాథియాన్ 2ml (లేదా) ప్రొఫెనోఫాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News February 20, 2026
BECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం గలవారు మార్చి 5 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/అసెస్‌మెంట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.24,356 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295, SC, ST, PwBDలకు ఫీజులేదు. సైట్: www.becil.com


