News April 15, 2025

డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

image

తూ.గో.జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు డ్రోన్‌లతో ప్రత్యేక నిఘాను పటిష్ఠం చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Similar News

News February 20, 2026

జిల్లా రిజిస్ట్రార్‌గా జగన్మోహనరావు బాధ్యతల స్వీకారం

image

తూ.గో. జిల్లా నూతన రిజిస్ట్రార్‌గా కె.జగన్మోహనరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సీనియర్ అసిస్టెంట్‌గా, గ్రేడ్-2, గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందిస్తూ పదోన్నతిపై ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News February 19, 2026

గొల్లగూడెం: ట్రాక్టరుపై నుంచి పడి బాలిక స్పాట్ డెడ్

image

దేవరపల్లి మండలంలోని గొల్లగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన ఓ కుటుంబం పొగాకు పనుల నిమిత్తం దుమంతులగూడెం వలస వచ్చింది. పనికి వెళ్తుండగా ట్రాక్టరుపై నుంచి బాలిక ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 19, 2026

కొవ్వూరు మున్సిపాలిటీపై పసుపు జెండా

image

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ పీఠం TDP పరమైంది. YCP మున్సిపల్ ఛైర్‌పర్సన్ బావన రత్నకుమారితో పాటు నలుగురు కౌన్సిలర్లు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో బుధవారం TDPలో చేరారు. దీంతో ఎమ్మెల్యేతో కలిపి కూటమి బలం 14కు చేరి స్పష్టమైన మెజారిటీ లభించింది. గత ఎన్నికల్లో YCP గెలిచినప్పటికీ, తాజా మార్పులతో కొవ్వూరు మున్సిపాలిటీని TDP కైవసం చేసుకుంది.