News March 5, 2025
డ్రోన్స్ పర్యవేక్షణలో ప్రశాంతంగా అమ్మవారి జాతర: SP

చీపురుపల్లిలో జరిగిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరను డ్రోన్స్ పర్యవేక్షణ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు చర్యలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశామన్నారు. భక్తులు సులభతరంగా అమ్మవారిని దర్శించుకొనే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడం, త్వరితగతిన భక్తులను వరుస క్రమంలో పంపేటట్లు బందోబస్తు నిర్వహించామన్నారు.
Similar News
News March 6, 2025
అవసరమైతే పోలీసులను వినియోగించుకుంటాం: కలెక్టర్

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణాలపై ముద్రించిన పోస్టర్లను తన ఛాంబర్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల కార్మికులను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే దీనికోసం పోలీసులను కూడా వినియోగించుకుంటామన్నారు.
News March 6, 2025
VZM: మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూత

అప్పటి సతివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివంగత పొట్నూరు సూర్యనారాయణ సతీమణి కనకమ్మ బుధవారం కన్నుముశారు. ఆమె గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పాలవలస సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ప్రజల సందర్శనార్థం పార్ధివదేహాన్ని పాలవలసలోని తన నివాసంలో అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News March 6, 2025
ఆ రూ.12 కోట్ల వసూలు చేయండి: VZM కలెక్టర్

లేబర్ సెస్ వసూలుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. మొత్తం నాలుగు విభాగాల్లో ఒక్క విజిలెన్స్ అలర్ట్ క్రింద సుమారు రూ.12 కోట్లు వరకు బకాయి ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా దీనిని వసూలు చేయడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న సుమారు 1300 క్లైయిములను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.