News August 8, 2025

డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పన: కలెక్టర్

image

కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎం విద్యాసంస్థ ఆధ్వర్యంలో డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన క్యాంప్ కార్యాలయంలో ట్రిపుల్ ఐటీడీఎం ఆధ్వర్యంలో రూపొందుతున్న ప్రదర్శనను ఆయన పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని తక్షణ వైద్య సదుపాయం అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News August 31, 2025

రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుంది: కలెక్టర్

image

మార్క్‌ఫెడ్ ద్వారా రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుందని, అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఆదివారం మార్కెటింగ్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ అధికారులతో ఉల్లి కొనుగోలు అంశంపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డులలో కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు.

News August 31, 2025

ఒకే గ్రామంలో 8 మందికి టీచర్ ఉద్యోగాలు

image

దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 8 మంది డీఎస్సీలో సత్తా చూపారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని, వారి తల్లిదండ్రులను బీసీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బుజ్జమ్మ సన్మానించారు. తన ఊరిలో 8 మంది ఉపాధ్యాయులుగా ఎంపికవ్వడం ఆనందంగా, గర్వంగా ఉందని ఆమె తెలిపారు.

News August 31, 2025

నందవరం: గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ కుటుంబం

image

ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం కష్టంగా ఉన్న ఈ పోటీ ప్రపంచంలో నందవరానికి చెందిన కురవ పెద్దనాగన్న, హనుమంతమ్మ కుమారుడు K.P నాగరాజు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. రైల్వే, సచివాలయం ఉద్యోగాలు సాధించి తాజాగా విడుదలైన డీఎస్సీలో (SA సోషల్) కొలువు సాధించాడు. నాగరాజు అన్న హెడ్ కానిస్టేబుల్, తమ్ముడు 2012 DSC లో SGTగా ఉద్యోగం సాధించారు. పెద్దనాగన్న కుమారులు గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.