News October 7, 2025
డ్రోన్ సిటీకి ప్రధానితో శంకుస్థాపన

ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రోన్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిసెంబరులో డ్రోన్ షోను నిర్వహించాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు కలిగే లబ్ధిని వివరించేందుకు ప్రధాని జిల్లా పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News April 13, 2026
హనుమకొండలో మెరుగైన ఇంటర్ ఫలితాలు

హనుమకొండ జిల్లాలో 2026 ఇంటర్మీడియట్ ఫలితాలు ఆశాజనకంగా నమోదయ్యాయి. ద్వితీయ సంవత్సర జనరల్ విభాగంలో 78.57%, ఓకేషనల్‌లో 73.78% ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగం 69.16% ఫలితాలతో ముందంజలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెల్లడించారు.
News April 13, 2026
IPL: లక్నోపై గుజరాత్ ఘనవిజయం

లక్నో వేదికగా LSGతో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 165 పరుగుల టార్గెట్‌ను 18.4 ఓవర్లలో ఛేదించింది. బట్లర్(60), గిల్ (56) రాణించారు. ఈ సీజన్‌లో GTకి ఇది రెండో విజయం కాగా లక్నోకు రెండో ఓటమి.
News April 13, 2026
BREAKING: టాస్ గెలిచిన ముంబై

వాంఖడే వేదికగా ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నారు.


