News October 7, 2025
డ్రోన్ సిటీకి ప్రధానితో శంకుస్థాపన

ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రోన్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిసెంబరులో డ్రోన్ షోను నిర్వహించాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు కలిగే లబ్ధిని వివరించేందుకు ప్రధాని జిల్లా పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News October 7, 2025
BSNLతో నెట్‌వర్క్ లేకపోయినా ఫోన్ మాట్లాడొచ్చు!

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNLలో తీసుకొస్తున్న మార్పులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా WiFi ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించే కొత్త ఫీచర్ VoWiFiను సంస్థ తీసుకొచ్చింది. అలాగే సరసమైన ధరకే రీఛార్జ్ ప్యాక్స్ లభిస్తుండటంతో ఆగస్టులో ఏకంగా 1.38 మిలియన్ల మంది BSNLకు మారినట్లు TRAI తెలిపింది. దీంతో యూజర్లు 91.7 మిలియన్లకు చేరారు. BSNLకి మారుతున్నారా?
News October 7, 2025
KNR: మద్యానికి బానిసై యువుకుడి ఆత్మహత్య

కరీంనగర్లోని బుట్టి రాజారాం కాలనీకి చెందిన శ్రీనివాస్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ రాత్రి ఇంటికి వచ్చి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా శ్రీనివాస్ ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 7, 2025
రంగారెడ్డి: ఓటర్లను మచ్చిక చేసుకుంటున్న ఆశావహులు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. పోటీ చేసే అభ్యర్థులు కొద్ది సంవత్సరాలుగా పట్టణాల్లో నివాసముంటున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో గ్రామాల బాట పట్టారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.