News January 3, 2026

డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక సాయం అందించాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లు, రెండు పడకల గదుల నిర్మాణం పై MHBD కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు.

Similar News

News February 19, 2026

కర్రెగుట్టల్లో ఆపరేషన్-2 కగార్ స్టార్ట్

image

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్-2 కగార్ స్టార్ట్ అయింది. మావోయిస్ట్ అగ్రనేతలే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. 5 వేల మంది CRPF బలగాలతో కూంబింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు అగ్రనేతలు లొంగుబాటుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్‌(మార్చి 31)కు ఇంకా 40 రోజులే మిగిలి ఉంది.

News February 19, 2026

KNR: వివాహిత ఆత్మహత్య.. కారణమిదే!

image

అత్తింటి వేధింపులు తాళలేక KNRలో మమత అనే <<19178040>>వివాహిత ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. పెళ్లైన నెల నుంచే అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు కవిత కట్నం కోసం వేధించారని బాధితురాలి తండ్రి పోషయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఆస్పత్రిలో ఉండగా తనను, సోదరుడు మహేశ్‌ను అత్తమామలు దూషించడంతో మనస్తాపం చెంది మమత బలవన్మరణానికి పాల్పడినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

News February 19, 2026

గద్వాల: కాబోయే భర్త వేధింపులు.. యువతి SUICIDE..!

image

కేటీదొడ్డి మండలం చింతలకుంటలో ఓ యువతి(18) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. యువతి ఆత్మహత్యకు ఆమెతో నిశ్చితార్థమైన హరి వేధింపులే కారణంగా తెలుస్తోంది. గతంలో యువకుడి మొదటి భార్య కూడా ఇలాగే బలైందన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.