News March 30, 2026

ఢిల్లీకి రావాల్సిన ఇరాన్ విమానంపై అమెరికా దాడి

image

సరకులు, ఔషధాలు తదితర మానవతా సాయాన్ని పొందేందుకు ఢిల్లీకి రావాల్సిన మహాన్ ఎయిర్ జెట్ విమానం అమెరికా దాడిలో ధ్వంసమైంది. ఇరాన్‌లోని మషద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ ఫ్లైట్ ఉండగా దాడి జరిగింది. భారత్ ఇప్పటికే మార్చి 18న నిత్యావసరాలను టెహ్రాన్‌కు పంపిన విషయం తెలిసిందే. రెండో దఫా 11 టన్నుల సరకులను సిద్ధంగా ఉంచింది. వీటి కోసం మహాన్ విమానం ఎల్లుండి ఢిల్లీకి రావాల్సి ఉంది.

Similar News

News April 13, 2026

ఈ నెల 30 దాకా రేషన్ పంపిణీ!

image

TG: 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సర్వర్ సమస్యలు, ఈపోస్ మెషీన్లు ఆగిపోవడం, స్టాక్ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 దాకా రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

News April 13, 2026

నేడు RRతో SRH ఢీ.. పరుగుల వరద ఖాయం!

image

IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి RR దూకుడు మీద ఉంది. పైగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు SRH 4 మ్యాచుల్లో 3 ఓటములు చవిచూసింది. నేటి మ్యాచులో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.

News April 13, 2026

5 కేజీల సిలిండర్ల సరఫరా పెంపు

image

గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 5 కేజీల LPG సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. మార్చి 23 నుంచి 13 లక్షలకు పైగా సిలిండర్లను అమ్మింది. ప్రస్తుతం రోజువారీ సేల్స్ లక్ష యూనిట్లను దాటాయి. ఎక్కువగా వలస కార్మికులు వీటిని కొంటున్నారు. మరోవైపు మార్చి నుంచి 4.24 లక్షల PNG కనెక్షన్లను ప్రభుత్వం యాక్టివేట్ చేసింది. డొమెస్టిక్ LPG సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 11న 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి.