News February 6, 2026
‘ఢిల్లీని షేక్ చేస్తాం’.. లష్కరే టెర్రరిస్టు ప్రేలాపనలు

ఇండియాలోని ప్రధాన సిటీల్లో దాడులు చేస్తామంటూ లష్కరే తోయిబా (LeT) టెర్రరిస్టు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వీ హెచ్చరించాడు. ‘అఖండ భారత్‌ను ఖండఖండాలుగా చేస్తాం. ఆగ్రాకు నిప్పు పెడతాం. దక్కన్‌ను మండిస్తాం. ఢిల్లీని షేక్ చేస్తాం’ అని లాహోర్‌లో ప్రేలాపనలు చేశాడు. కశ్మీర్‌కు విముక్తి కల్పిస్తామని చెప్పాడు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ఏటా ఫిబ్రవరి 5న <<19062687>>కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని<<>> నిర్వహిస్తోంది.
Similar News
News February 6, 2026
పాక్‌లో బాంబు దాడి.. 69కి చేరిన మృతులు

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన <<19067266>>సూసైడ్ బాంబింగ్‌లో<<>> మృతుల సంఖ్య 69కి చేరింది. మరో 170 మంది తీవ్రంగా గాయపడ్డట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడికి అఫ్గానిస్థానే కారణమని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాకుతో ఆ దేశంపై దాడి చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దాడికి తామే బాధ్యులమంటూ ఏ సంస్థ/వ్యక్తి ప్రకటించలేదు.
News February 6, 2026
తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు

TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దైంది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్టు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
News February 6, 2026
260 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<


