News September 8, 2025

ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కలిసిన మెదక్ ఎంపీ

image

ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను సోమవారం మెదక్ MP రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తాను రాసిన పుస్తకాలను MP రఘునందన్ రావుకు అందించారు. MP మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిని కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. తాను రాసిన పుస్తకాలను అందించిన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 9, 2025

ఇక నుంచి గిరిజనులకూ 14.2 కేజీల సిలిండర్లు

image

AP: రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఇక నుంచి 14.2 కేజీల LPG సిలిండర్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘దీపం-2’ పథకం కింద ప్రస్తుతం 5Kgs సిలిండర్లను ఇస్తుండగా, వాటి స్థానంలో 14.2Kgs సిలిండర్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్, డాక్యుమెంటేషన్ ఛార్జీల కోసం ₹5.54Cr కేటాయించింది. ఈ నిర్ణయంతో 23,912 మందికి లబ్ధి చేకూరనుంది.

News September 9, 2025

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కలెక్టరేట్‌లో సమీక్ష

image

కామారెడ్డి జిల్లాలో రాబోయే MPTC, ZPTC ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇవాళా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 25 ZPTC, 233 MPTC స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను ఈ నెల 6న ప్రచురించామని తెలిపారు. SEP 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటి పరిష్కారం అనంతరం 10న తుది జాబితాను విడుదల చేస్తామన్నారు.

News September 9, 2025

కర్నూలులో హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

కర్నూలులో జరిగిన షేక్ ఇజహర్ అహ్మద్‌ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు DSP బాబు ప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి 3 కత్తులు, స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత గొడవల కారణంగా ఇమ్రాన్‌, ఇర్ఫాన్‌, షేక్‌ జాహీన్‌ అహ్మద్‌, ఎస్‌ఎండీ ఇర్ఫాజ్‌, యూసుఫ్‌ కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. ఇమ్రాన్‌, ఇర్ఫాన్‌, షేక్‌ జాహీన్‌ అహ్మద్‌ను అరెస్టు చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.