News December 26, 2025
ఢిల్లీలో పరేడ్.. జగిత్యాల మేడం సెలక్ట్..!

JAN 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు TG & AP NCC క్యాడెట్స్‌ను సెలక్ట్ చేశారు. ఇందులో భాగంగా జగిత్యాలకు చెందిన అసోసియేట్ NCC ఆఫీసర్, PET చేని మంగా ANOగా ఎంపికయ్యారు. TG & AP డైరెక్టరేట్ NCC క్యాడెట్స్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్, విశ్వప్రసాద్, నిరంజన్, రవికుమార్, కృష్ణప్రసాద్, క్రీడాకారులు మంగను అభినందించారు.
Similar News
News December 26, 2025
పిడుగురాళ్ల: టోల్ ప్లాజ్ వద్ద ఘోర ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైకుపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2025
GNT: పెదకాకాని హైవేపై ప్రమాదం.. చిధ్రమైన శరీరం

పెదకాకాని హైవేపై శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించగా, శరీరం నుజ్జునుజ్జై భయంకరంగా మారింది. మృతదేహం ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా మారింది. దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మృతదేహాన్ని గుంటూరు కొవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకాయంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు.
News December 26, 2025
చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ

భారత మహిళా క్రికెటర్ దీప్తీ శర్మ T20I ఫార్మాట్‌లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నారు. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్, ఓవరాల్‌గా రెండో మహిళగా నిలిచారు. తొలిస్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మేగన్(151) ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో 151వ వికెట్‌ను కూడా తీసి ఆమె రికార్డును దీప్తి సమం చేశారు.


