News November 1, 2025
ఢిల్లీలో వాయు కాలుష్యంతో 17,188 మరణాలు

ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఏడింటిలో ఒక మరణానికి వాయుకాలుష్యమే కారణంగా ఉంది. 2023లో వాయుకాలుష్యం వల్ల 17,188(15%) మంది మరణించినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యూయేషన్(IHME) నివేదిక తెలిపింది. అదే ఏడాది హైబీపీతో 12.5%, మధుమేహంతో 9శాతం, అధిక కొలెస్ట్రాల్‌తో 6%, ఊబకాయంతో 5.6శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. 2018-24 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఉంది.
Similar News
News February 17, 2026
OFFICIAL: T20WC నుంచి ఆస్ట్రేలియా ఔట్

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇవాళ భారీ వర్షం కారణంగా జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ రద్దయ్యింది. దీంతో చెరో పాయింట్ దక్కింది. మొత్తంగా 5 పాయింట్లతో గ్రూప్-B నుంచి జింబాబ్వే సూపర్-8కు చేరుకుంది. ఇప్పటికే మూడు విజయాలతో శ్రీలంక కూడా తదుపరి దశకు వెళ్లింది. ఆడిన 3 మ్యాచ్‌లలో రెండు ఓడిన AUS తర్వాతి మ్యాచ్‌లో గెలిచినా 4 పాయింట్లే ఉంటాయి.
News February 17, 2026
పసిబిడ్డ ఆరోగ్యం కోసం..

ప్రెగ్నెన్సీలో తల్లి ఎదుర్కొనే పరిస్థితులు బిడ్డ మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. తల్లి కఠిన పరిస్థితుల్లో జీవిస్తుంటే అవి మెదడుపై ప్రతికూల ఫలితాలు చూపిస్తాయి. డిప్రెషన్, ఓవర్ థింకింగ్, ఒత్తిడి వల్ల శిశువుల మెదడులో నాడుల మధ్య అనుసంధానం బలహీనంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందుకే ఎలాంటి గడ్డు పరిస్థితిలోనైనా గర్భిణులు ద్యానం, వ్యాయామం చేయడం మానకూడదని సూచిస్తున్నారు.
News February 17, 2026
అణు చర్చల వేళ హార్ముజ్‌లో ఇరాన్ యుద్ధ విన్యాసాలు

అణు ఒప్పందంపై USతో చర్చలు ప్రారంభమైన వేళ ఇరాన్ తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. హార్ముజ్ జలసంధి లక్ష్యంగా ‘రెవల్యూషనరీ గార్డ్’ లైవ్-ఫైర్ విన్యాసాలు చేపట్టింది. తీర ప్రాంతం నుంచి ప్రయోగించిన మిస్సైల్స్ జలసంధిలోని లక్ష్యాలను తాకినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉండే ఈ జలమార్గంలో విన్యాసాలు చేయడం ద్వారా ఇరాన్ ప్రపంచ దేశాలకు బలమైన సంకేతాలు పంపింది.


