News January 5, 2026

ఢిల్లీ అల్లర్లు.. అసలు అప్పుడు ఏం జరిగింది?

image

2020 ఫిబ్రవరిలో CAA చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు ఈశాన్య ఢిల్లీలో తీవ్ర హింసకు దారితీశాయి. ఐదు రోజుల పాటు సాగిన ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సమయంలో దేశ పరువు తీయడానికి పక్కా ప్లాన్‌తో చేసిన కుట్ర ఇదని పోలీసులు ఛార్జ్‌షీట్ వేశారు. దీని వెనుక ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ ఉన్నారని ఆరోపిస్తూ వారిపై UAPA కింద కేసు పెట్టారు.

Similar News

News January 7, 2026

మళ్లీ అదే సెంటిమెంట్‌ ఫాలో కానున్న నాగార్జున!

image

రా కార్తీక్ డైరెక్షన్‌లో సినీ హీరో నాగార్జున 100వ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీని నాగార్జునకు కలిసొచ్చిన డేట్ మే 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘విక్రమ్‌’, ‘మనం’ ఇదే తేదీన రిలీజై విక్టరీ కొట్టాయి. తాజా సినిమా విషయంలోనూ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో కానున్నారని టాక్. ఈ చిత్రానికి ‘100 నాటౌట్’, ‘లాటరీ కింగ్’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News January 7, 2026

డబ్బు ముందు ‘బంధం’ ఓడిపోయింది!

image

పోయే ఊపిరి నిలవాలంటే డబ్బే కావాలి అన్నాడు ఓ కవి. కానీ ఆ డబ్బుల కోసం కొందరు సొంత బంధాలను తెంచుకుంటున్నారు. నిజామాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన విషయం వెలుగుచూసింది. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా ప్లాన్‌తో భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. అంతకుముందు KNRలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మనుషుల మధ్య సంబంధాలను కాలరాస్తున్నాయి.

News January 7, 2026

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

image

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని వైద్యులు చె‌బుతున్నారు. ‘అలా చేస్తే కడుపులోని జీర్ణ రసాలు పలుచబడతాయి. దీంతో ఫుడ్ సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. నీటి అధిక పరిమాణం కడుపులో ఒత్తిడిని పెంచి, ఆహారాన్ని అరిగించాల్సిన యాసిడ్‌ను అన్నవాహికలోకి నెడుతుంది. ఫలితంగా గుండెల్లో మంటకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత 30-60 నిమిషాలు ఆగి వాటర్ తాగాలి’ అని సూచిస్తున్నారు.