News January 14, 2026

ఢిల్లీ కాలుష్యం.. తప్పుకున్న వరల్డ్ నం.3

image

ఢిల్లీలో కాలుష్యం ఆటలపై ప్రభావం చూపిస్తోంది. తీవ్రమైన కాలుష్యం కారణంగా ‘ఇండియా ఓపెన్’ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వరల్డ్ నం.3, డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహణకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు. దీంతో ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 5వేల డాలర్ల ఫైన్ చెల్లించారు. కాగా ‘ఇండియా ఓపెన్’ నుంచి ఆండర్స్ తప్పుకోవడం ఇది వరుసగా మూడోసారి.

Similar News

News February 6, 2026

సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా?

image

AP: సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గనులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు. కాగా ఇప్పటివరకు CM ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు TTD EOగా అదనపు బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న TTD EO సింఘాల్‌ను బదిలీ చేశారు.

News February 6, 2026

30వారాల గర్భాన్ని తొలగించేందుకు సుప్రీం అనుమతి!

image

బాయ్ ఫ్రెండ్ వల్ల 17ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన ఓ అమ్మాయి 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు సదరు యువతికే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇష్టం లేని గర్భాన్ని దాల్చాలని ఏ స్త్రీని బలవంతం చేయలేమని జడ్జీలు పేర్కొన్నారు. బాధితురాలి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని వెంటనే అబార్షన్ చేయాలని కోర్టు ఆదేశించింది.

News February 6, 2026

స్మృతి మంధాన ‘రాయల్’ విజయం!

image

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులకు కుంగిపోకుండా, పట్టుదలతో పోరాడి RCBని మరోసారి విజేతగా నిలిపారు స్మృతి మంధాన. మానసిక వేదనను పక్కన పెట్టి, మైదానంలో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకోవడం ఆమె సంకల్పానికి నిదర్శనం. పడిలేచిన కెరటంలా పుంజుకున్న ఆమె ప్రయాణం.. నిరాశలో కూరుకుపోతున్న ఎందరికో ఆదర్శం. ఈ విజయం కప్పు మాత్రమే కాదు, ఆమె ఆత్మవిశ్వాసానికి అభిషేకం.. మనోనిబ్బరానికి మరో మజిలీ.!