News February 27, 2026

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. కేసులో ఆయనతో పాటు మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను డిశ్ఛార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

Similar News

News February 28, 2026

రాజ్యసభ రేసులో LGBTQ.. ఎవరీ మేనకా గురుస్వామి?

image

మార్చి 16న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు TMC ప్రకటించిన జాబితాలో మేనకా గురుస్వామి ఎంపిక అందరినీ ఆకర్షిస్తోంది. ఈమె సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. LGBTQ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) వర్గానికి చెందినవారు. హోమో సెక్సువాలిటీని నేరంగా పరిగణించే IPC సెక్షన్ 377ను సుప్రీం కొట్టేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈమె RSకు ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా రికార్డు సృష్టిస్తారు.

News February 28, 2026

విజయ్ అఫైర్ ఈమెతోనేనా?

image

తమిళ స్టార్ హీరో విజయ్‌కు ఒక నటితో <<19254560>>అఫైర్ <<>>ఉందని ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్‌లో పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ నటి పేరును ఆమె బయటపెట్టకపోయినా గతంలో విజయ్‌తో కలిసి నటించిన త్రిషతో ఆయనకు సంబంధం ఉందంటూ నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న కోర్టులో విజయ్ తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంది.

News February 28, 2026

₹25 వేల కోట్ల స్కామ్‌లో క్లీన్ చిట్: ‘BJP వాషింగ్ మెషీన్’ విమర్శలు

image

మహారాష్ట్ర రాజకీయాల్లో ₹25 వేల కోట్ల MSCB స్కామ్ కేసు క్లోజ్ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎలాంటి అక్రమాలు జరగలేదన్న EOW రిపోర్టును ముంబై కోర్టు ఆమోదించింది. దీంతో దివంగత అజిత్ పవార్ BJP కూటమిలో ఉండటం వల్లే క్లీన్ చిట్ వచ్చిందంటూ ప్రతిపక్షాలు ‘BJP వాషింగ్ మెషీన్’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. రాజకీయ అవసరాల కోసమే పవార్ కుటుంబంపై ఉన్న కేసులను మాఫీ చేశారని విమర్శకులు మండిపడుతున్నారు.