News March 9, 2026
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రయల్ కోర్ట్ తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవితలతో సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇటీవల వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.
Similar News
News April 5, 2026
GK: నేషనల్ మారిటైమ్ డే విశేషాలు

* INDలోని సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీకి చెందిన ‘SS లాయల్టీ’ నౌక 1919, APR 5న తొలిసారి ముంబై నుంచి లండన్‌కు బయలుదేరింది.
* ఆ రోజుకు గుర్తుగా ప్రభుత్వం 1964 నుంచి నేషనల్ మారిటైమ్ డేను నిర్వహిస్తోంది.
* దేశ సముద్ర తీరం పొడవు 11,098KM. 12 మేజర్, 217 మైనర్ పోర్టులున్నాయి.
* మొత్తం వాణిజ్యంలో 95% సముద్రాల ద్వారానే జరుగుతోంది.
* ఈ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘సాగర్ సమ్మాన్’ అవార్డులిస్తారు.
News April 5, 2026
ధురంధర్-2ను వీక్షించిన పాక్ మాజీ ప్రధాని?

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ధురంధర్-2 సినిమా కాపీని తెప్పించుకొని వీక్షించినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్టు ఖలీద్ వెల్లడించారు. అందులో తన పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని ఆయన మెచ్చుకున్నట్లు తెలిపారు. పాక్‌లో ఈ చిత్రంపై నిషేధం విధించినప్పటికీ తాను తొలి రోజే చూసినట్లు ఖలీద్ గతంలో చెప్పారు. కాగా ధురందర్-2లో నవాజ్ పాత్రను మషూర్ అమ్రోహి పోషించారు. క్యాస్టింగ్ పర్‌ఫెక్ట్‌గా సెట్టవడం విశేషం.
News April 5, 2026
భారీగా తగ్గిన ధరలు.. రూ.100కే 8 కేజీలు

ఉల్లి ధరలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల రూ.100కే 8 కేజీల ఉల్లి అమ్ముతున్నారు. అటు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెల కిందటి వరకు క్వింటా రూ.2వేలు ఉండగా ఇప్పుడు రూ.800 నుంచి రూ.1,400 మాత్రమే పలుకుతోంది. మరి మీ ఏరియాలో ఉల్లి రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.


