News July 10, 2025
ఢిల్లీ వెళ్లిన అనకాపల్లి కలెక్టర్

జల్ జీవన్ మిషన్‌పై ఢిల్లీలో నేడు జాతీయ సదస్సు జరిగింది. రాష్ట్ర ప్రతినిధిగా అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోఈ పథకం కింద ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనిని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి సదస్సు జరగనుంది. ఇందులో కలెక్టర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
Similar News
News July 11, 2025
వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)ను ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
News July 11, 2025
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పథకం అమలు, లబ్ధిదారుల శిక్షణ, ఆర్ధిక సహకారం, టూల్ కిట్ల పంపిణి తదితర అంశాలపై సమీక్షించారు. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
News July 11, 2025
కరీంనగర్: ప్రాణం తీసిన కోతులు

హుజురాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బూర సుదర్శన్ మృతిచెందారని స్థానికులు తెలిపారు. నెల రోజుల క్రితం ఇంటి వద్ద అతడిపై కోతులు దాడి చేసి, కుడి కాలును కరిచాయని చెప్పారు. తీవ్రంగా గాయమై సెప్టిక్ అయినందున ఎంజీఎం ఆసుపత్రిలో 20 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతిచెందారన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కోతుల కారణంగా ప్రాణం పోయింది.