News October 30, 2025
తంగళ్లపల్లి: టార్పాలిన్ కవర్లు తప్పనిసరి: కలెక్టర్ ఆదేశం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కచ్చితంగా టార్పాలిన్ కవర్లు అందజేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం ఆమె తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతాన్ని పరిశీలించారు. రైతుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
Similar News
News October 31, 2025
HNK: ‘మా బేబీ మాకు కావాలి’ అంటూ బంధువుల ఆందోళన

హన్మకొండ నయినగర్‌లోని ఓ హాస్పిటల్‌లో ఆపరేషన్ సమయంలో శిశువు మృతి చెందడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆపరేషన్ వికటించి బాబు మరణించాడని, అయితే ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని దాచిపెట్టి నాలుగు రోజులుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ‘మా బేబీ మాకు కావాలి’ అంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగగా.. డాక్టర్ తప్పిదం లేదంటూ హాస్పత్రి సిబ్బంది వాదిస్తున్నారు.
News October 31, 2025
KNR: ‘చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం’

KNR జిల్లా చిట్‌ఫండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదుపు దినోత్సవం నిర్వహించారు. ‘ఈరోజు మనం పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది కేవలం ఒక ఆచార దినం కాదు. ఇది ప్రతి కుటుంబంలో ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్ భద్రత, క్రమశిక్షణకు సంకేతం’ అని అధ్యక్షులు పెంట శ్రీనివాస్ అన్నారు. చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.
News October 31, 2025
సైదాపూర్: రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం: పొన్నం

సైదాపూర్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలం ఉన్నారు.


