News January 8, 2026

తంగళ్ళపల్లి: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

image

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్‌లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వాపూర్‌కు చెందిన సుధగోని పర్ష రాములు (48) గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతూ కుంగిపోయాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News January 30, 2026

మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ సెకండ్ ఫిల్మ్?

image

‘రాజాసాబ్’ తర్వాత డార్లింగ్ ప్రభాస్ మరోసారి డైరెక్టర్ మారుతితో మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈక్రమంలో హోంబలే ఫిల్మ్స్‌తో మారుతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ నిర్మాణ సంస్థతో మారుతికి అడ్వాన్స్ కూడా ఇప్పించారని తెలుస్తోంది. స్క్రిప్ట్ పూర్తయ్యాక ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

News January 30, 2026

VASTHU: ఇంటి ప్రాంగణంలో ఏ చెట్లు పెంచాలంటే?

image

ఇంటి ప్రాంగణంలో తులసి, బిల్వం, పసుపు వంటి దేవతా వృక్షాలు పెంచాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత చేకూరుతాయని అంటున్నారు. ‘మల్లె, గులాబీ మొక్కలు పెంచాలి. వీటి పరిమళాలు మనసుకి ఆనందాన్నిస్తాయి. మనీ ప్లాంట్, తమలపాకు మొక్కలు శుభప్రదమే. అవసరాల మేర కరివేపాకు, అరటి, నిమ్మ, ఆకుకూరలు కూడా పెంచవచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 30, 2026

రామకృష్ణ తీర్థ ముక్కోటికి అన్ని ఏర్పాట్లు పూర్తి

image

తిరుమలలో ఆదివారం జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. 12 ఏళ్లలోపు పిల్లలు, అధిక బరువు, ఆస్తమా, గుండె, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అటవీ మార్గంలో నడిచివెళ్లేందుకు అనుమతి లేదు. పాపవినాశనం వద్ద మెడికల్ స్క్రీనింగ్ అనంతరమే తీర్థానికి అనుమతిస్తారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు.