News December 14, 2025
తంగళ్ళపల్లి మండలంలో పట్టునిలుపుకున్న BRS

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తంగళ్ళపల్లి మండలంలో 30 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 17 స్థానాలు దక్కించుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 7 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 4 స్థానాల్లో గెలిచారు. తంగళ్లపల్లి మండలంలో 17 స్థానాలతో అగ్రస్థానంలో నిలవడం పట్ల ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు.
Similar News
News December 15, 2025
ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించండి: సుభాష్

రాష్ట్రంలోని బీసీ ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్న తీవ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దులూరు సుభాష్ యాదవ్ కోరారు. ఈమేరకు విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రాజుకి వినతిపత్రం సమర్పించారు. భవనాల దుస్థితి, నాసిరక ఆహారం, వార్డెన్ల కొరత, స్కాలర్‌షిప్‌ల ఆలస్యం, గర్ల్స్ హాస్టళ్లలో భద్రతా లోపం వంటి అనేక సమస్యలు ఉన్నాయని, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
News December 15, 2025
ఒత్తిడిని జయించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి: కలెక్టర్

విద్యార్థుల్లో ఆత్మహత్యల ప్రభావాన్ని తగ్గించి, మానసిక ఒత్తిడిని జయించేలా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ (డిఎల్‌ఎంసీ) ఏర్పాటు అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చదువుతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 15, 2025
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆంక్షలు అమలు: సీపీ

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 17న జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా BNSS163 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట, దూల్మిట్ట, మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 15 సాయంత్రం 5 గంటల నుంచి 18 సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.


