News October 23, 2025

తంగళ్ళపల్లి: 3 రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

image

తండ్రి, కొడుకు మృతి చెందడంతో తంగళ్ళపల్లిలో విషాదం నెలకొంది. మంగళవారం తండ్రి మెరుపుల పర్షరాములు(70) మృతిచెందగా, గురువారం కొడుకు శ్రీనివాస్(45) అనారోగ్యంతో కన్నుమూశాడు. గల్ఫ్‌ నుంచి
తిరిగి వచ్చిన శ్రీనివాస్ కులవృత్తి చేసుకుంటు జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ వరుస ఘటనలతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Similar News

News October 23, 2025

NOV 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు: పవన్

image

AP: పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. ‘నవంబర్ 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలి. పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలి. పాలనా సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి. పల్లె పండుగ 2.0తో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక ఇవ్వాలి’ అని ఆదేశించారు.

News October 23, 2025

GNT: నానో టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన I, V ఇయర్స్ నానో టెక్నాలజీ సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫలితాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 3వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1860/- నగదు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.

News October 23, 2025

నంద్యాల జిల్లా స్పోర్ట్స్ హాస్టల్‌లో ప్రవేశాలకు క్రీడా పోటీలు

image

నంద్యాల జిల్లాస్థాయి క్రీడా పోటీలను పద్మావతి నగర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈనెల 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. జిల్లాలోని 5 నుంచి 8వ తరగతి చదువుతున్న బాలురు, బాలికలు 17 క్రీడాంశాలలో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉచిత వసతి, భోజనం, అత్యున్నత శిక్షణ కల్పిస్తామన్నారు.