News February 7, 2025
తండెల్ సినిమాలో అవకాశం అందుకున్న కన్నెపల్లి వాసి
కన్నెపల్లి మండల కేంద్రం ముత్తపూర్‌కు చెందిన హరీష్ మొదట ఢీ జోడిలో సైడ్ డాన్సర్‌గా రాణించారు. అనంతరం శుక్రవారం విడుదలైన తండేల్ సినిమాలో విలన్‌కు సైడ్ క్యారెక్టర్‌గా హరీష్ నటించారు. డైరెక్టర్‌గా చెందు మండేటి, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి సినిమాలో నటించారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన హరీష్ చిన్న పాత్రలో కనిపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరకు సినిమాలో కనిపించారు.
Similar News
News February 7, 2025
నల్గొండ: గ్రీవెన్స్ డే.. ఇక నుంచి ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’
ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ఇప్పటినుంచి సైబర్ క్రైమ్‌కి సంబంధించిన ఫిర్యాదులు కూడా తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మేరకు ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’ అనే కార్యక్రమాన్ని ఈ సోమవారం నుంచే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బాధితులు తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
News February 7, 2025
కాళేశ్వరంలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు
కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగు నీటి ఏర్పాటు, తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటుగా అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
News February 7, 2025
రేపటి లోగా బుమ్రా ఫిట్‌నెస్‌పై రిపోర్ట్!
భారత స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల్లో ఫిట్‌నెస్‌పై నివేదిక రానుంది. దాని ఆధారంగా ఇంగ్లండ్‌తో మిగతా వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడంపై BCCI నిర్ణయం తీసుకోనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.