News October 18, 2024
తంబళ్లపల్లె విద్యార్థిని తేజశ్వినికి సీఎం ప్రశంసలు

CA ఫలితాలల్లో ఆలిండియా 14వ ర్యాంకు, CMA పరీక్షల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన తంబళ్లపల్లె విద్యార్థిని తేజశ్వినిని CM చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఆమె తన నాన్నతోపాటూ CMను అమరావతిలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి ర్యాంకులతో ఏపీ పేరు ప్రతిష్ఠలను నిలపడం గర్వంగా ఉందని సీఎం అన్నారు.
Similar News
News February 12, 2026
చిత్తూరు: YCP కమిటీ నియామకాల విడుదల

చిత్తూరు జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాలు జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వివరాలు విడుదల చేశారు. డిస్ట్రిక్ట్ యూత్ వింగ్ సెక్రటరీగా పుంగనూరు కమతంపల్లికి చెందిన కొమ్మిరి కుమార్, డిస్ట్రిక్ట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా ఈశ్వర్ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.
News February 12, 2026
చిత్తూరు: ఓటర్ల జాబితాకు కసరత్తు!

జిల్లాలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, పుంగనూరు, నగరి, పలమనేరు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పాలకమండలి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందో తెలియాల్సి ఉంది. చిత్తూరులో 50 డివిజన్లు, పలమనేరు మున్సిపాలిటీలో 26, నగరిలో 29, కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా మార్చి 9న ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు చర్యలు చేపట్టారు.