News August 25, 2025
తంబళ్లపల్లె: షూటింగ్ బాల్ జూనియర్ జట్టుకు ముగ్గురు ఎంపిక

తంబళ్లపల్లె (M) కన్నెమడుగు హై స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్ధినులు జూనియర్ షూటింగ్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారని పీడీ ఖాదర్ బాషా తెలిపారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధినులు రిషిత, ప్రియ ప్రవల్లికతో పాటు స్టాండ్ బైగా స్వాతి ఎంపికయ్యారన్నారు. మదనపల్లెలోని ఓ పాఠశాలలో ఆదివారం జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ జునైద్ అక్బరీ, కార్యదర్శి గౌతమి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జట్టు ఎంపిక జరిగింది.
Similar News
News August 25, 2025
సంగారెడ్డి: ఇన్‌స్పైర్‌కు స్పందన నామమాత్రం

విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే ఇన్‌స్పైర్ అవార్డు నామినేషన్ల పై ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. రెండు నెల క్రితం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 2,500 మంది విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఇప్పటి వరకు 255 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేశారు. చివరి తేదీ సెప్టెంబర్ 15 లోపు దరఖాస్తులు చేయించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు.
News August 25, 2025
నచ్చినచోట ఆయిల్ కొంటాం: భారత్

ఇండియన్ గూడ్స్‌పై US టారిఫ్స్ ఆంక్షల నేపథ్యంలో రష్యాలోని భారత అంబాసిడర్ వినయ్ కుమార్ ఫైరయ్యారు. ‘మార్కెట్లో బెస్ట్ డీల్ ఎక్కడుంటే అక్కడే భారత్ ఆయిల్ కొనుగోళ్లను కొనసాగిస్తుంది. US నిర్ణయం అసమంజసం. ఇది ఫెయిర్ ట్రేడ్ రూల్స్‌ను అణచివేయడమే. 140 కోట్ల భారతీయుల అవసరాలు తీర్చడానికే ప్రాధాన్యమిస్తాం. రష్యాతో పాటు పలు దేశాలతో భారత సహాయ సహకారాల వల్లే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరపడింది’ అని స్పష్టం చేశారు.
News August 25, 2025
BRSలోకి కోనప్ప..! RSP పరిస్థితి ఏంటి..?

ASF జిల్లాలో రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. మాజీ MLA కోనేరు కోనప్ప BRSలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన ప్రత్యర్థి RSP పార్టీలో చేరడంతో కాంగ్రెస్ గూటికి చేరారు కోనప్ప. కానీ ఆ పార్టీలో కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తనకీ కాంగ్రెస్‌కు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. కోనప్ప మళ్లీ BRSలోకి వస్తే RSPతో కలిసి పని చేస్తారా? ఇద్దరి మధ్య వైరం అలాగే ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.