News October 14, 2025

తగ్గిన డిమాండ్.. పతనమవుతున్న ధరలు

image

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు తగ్గుముఖం పట్టినట్లు వ్యాపారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణం అంటున్నారు. సాధారణంగా దీపావళికి డిమాండ్ ఉంటుందని, ఈ దఫా అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం ధర కిలో రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుందన్నారు. రానున్న కాలంలో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.

Similar News

News October 14, 2025

జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా సుజాత బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారినిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ సంబంధిత శాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న పరిమళ బదిలీ కావడంతో కొద్ది కాలంగా ఈ పోస్ట్ భర్తీ కాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న సుజాతకు ప్రమోషన్ లభించడంతో అధికారులు ఆమెను నెల్లూరుకు బదిలీ చేశారు.

News October 14, 2025

MROపై దౌర్జన్యం.. పోలీసులకు ఫిర్యాదు

image

లింగసముద్రంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సోమవారం తాగిన స్థితిలో ఉన్న ఆయన డ్యూటీలో ఉన్న తహశీల్దార్‌పై ఆయన ఛాంబర్‌లోనే దౌర్జన్యానికి తెగబడి, నానా మాటలు అన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తనపై దౌర్జన్యం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహశీల్దార్ కోటేశ్వరరావు తెలిపారు.

News October 13, 2025

విచారణ జరిపి న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

image

చట్ట ప్రకారం విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేస్తామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల తెలిపారు. నెల్లూరు పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు 125 ఫిర్యాదులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి అర్జీలను పరిష్కరించాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు.