News October 10, 2025

తగ్గిన పల్లికాయ, పెరిగిన మొక్కజొన్న ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు శుక్రవారం చిరు ధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మక్కల ధర పెరగగా, పల్లికాయ ధర తగ్గింది. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,130 ధర పలకగా.. ఈరోజు రూ.2,160 చేరింది. సూక పల్లికాయకు గురువారం రూ.6,500 ధర రాగా.. నేడు రూ.5,900కి పడిపోయింది. పచ్చి పల్లికాయకు నిన్న రూ.4,000 ధర పలకగా.. శుక్రవారం రూ.4,100 అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. దీపిక రకం మిర్చికి రూ.14 వేలు వచ్చింది.

Similar News

News October 10, 2025

ఆర్టీఐ ద్వారా ప్రజలకు సుపరిపాలన: డీఐఈవో

image

ఆర్టీఐ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని డీఐఈవో డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఏవీవీ జూనియర్ కాలేజీలో ఆర్టీఐపై నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలను అయన పరిశీలించారు. సమాచార హక్కు చట్టం-2005 అనేది ప్రజలకు సమాచారాన్ని పొందడంలో వజ్రాయుధంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి 20 ఇండ్లు పూర్తయినందున ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

News October 9, 2025

వరంగల్: తగ్గిన చిరుధాన్యాల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చిరుధాన్యాలు ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,140 ధర పలకగా.. ఈరోజు రూ.2,130 చేరింది. సూక పల్లికాయకు నిన్న రూ.6,610 ధర రాగా.. గురువారం రూ.6,500 వచ్చింది. పచ్చి పల్లికాయకు బుధవారం రూ.4,100 ధర పలకగా.. ఈరోజు రూ.4వేలు అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

News October 9, 2025

వరంగల్: ప్రజలకు సమాచార అస్త్రం ఆర్టీఐ: డీఐఈఓ

image

ఆర్టీఐ ద్వారా సుపరిపాలన అనే అంశంపై వరంగల్ జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టం-2005పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. రంగశాయిపేట, కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించి విద్యార్థులకు బహుమతులను అందించారు. సమాచార హక్కు చట్టం-2005 ప్రజలకు సమాచారాన్ని పొందడంలో అస్త్రంగా ఉపయోగపడుతుందన్నారు.