News December 13, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.
Similar News
News April 14, 2026
20 ఏళ్ల పాటు సీఎం.. నేటితో ముగిసిన శకం

బిహార్‌లో దాదాపు 20 ఏళ్ల పాటు CMగా కొనసాగిన నితీశ్ <<19649099>>శకం<<>> నేటితో ముగిసింది.
*తొలిసారి 2000లో 7 రోజులు
*2005-10 వరకు 1,827 రోజులు
*2010-14 వరకు 1,270 రోజులు
*2015లో 270 రోజులు
*2015 నుంచి 2017 వరకు 614 రోజులు
*2017 జులై నుంచి 2020 వరకు 1,204 రోజులు
*2020 NOV నుంచి 2022 వరకు 631 రోజులు
*2022 AUG నుంచి 2024 వరకు 536 రోజులు
*2024 నుంచి 2025 వరకు 661 రోజులు
*2025 NOV నుంచి 2026 APR వరకు 146 రోజులు
News April 14, 2026
రోబోలతోనే రష్యా స్థావరాన్ని దక్కించుకున్న ఉక్రెయిన్!

2022 నుంచి రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ ఇప్పుడు బరిలో రోబోలను నిలిపి మిషన్స్ చేపడుతోంది. ఈ క్రమంలో తొలిసారిగా జవాన్లు లేకుండానే రోబోలతో ఓ రష్యా స్థావరాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. గత మూడు నెలల్లో ఈ గ్రౌండ్ వెహికల్స్ 22వేలకుపైగా మిషన్స్ చేపట్టాయని తెలిపారు. టెక్నాలజీతో ప్రాణనష్టం తగ్గించొచ్చనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
News April 14, 2026
మరోసారి తెలుగు సినిమాలో ఆలియా?

అందంతో పాటు విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలియా భట్. ఆమె తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమాలోనే(RRR) నటించారు. త్వరలోనే మరో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. NTR-NEEL మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఆలియా ప్రస్తుతం ‘ఆల్ఫా’, ‘లవ్&వార్’ సినిమాల్లో నటిస్తున్నారు.


