News January 13, 2026
తగ్గిన బాస్మతీ రైస్ ధరలు.. కారణమిదే

ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్ల ప్రభావం మన బాస్మతీ బియ్యంపై పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు కిలోకు ₹5-10 వరకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5.99 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అయ్యాయి. అక్కడ గొడవలతో పేమెంట్లు ఆగిపోవడం, షిప్‌మెంట్లు ఆలస్యం కావడంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌లో అస్థిరత వల్ల ధరలు ఇంకా తగ్గొచ్చని అంచనా.
Similar News
News February 19, 2026
383 ప్రభుత్వ కంపెనీలు.. అలా పడున్నాయి అంతే!

ఆదాయం లేదు.. పని లేదు, ఉన్నా అంతంతమాత్రమే. అయినా ఎప్పటికప్పుడు ఆడిట్స్ జరుగుతూ అధికారిక లెక్కల్లో ఉంటున్నాయి. దేశంలోని 383 ప్రభుత్వ రంగ సంస్థల దుస్థితి ఇది. ఈ కంపెనీలను మూసివేయాలన్నా సుదీర్ఘ లీగల్ ప్రొసీజర్, కొన్ని సంస్థలు కోర్టు కేసుల్లో ఉండటం, అసెట్‌లా వాడుకునేందుకు, రాజకీయ కారణాలతో సాధ్యం కావట్లేదు. దీంతో ట్యాక్స్ పేయర్స్‌పైన భారం పడుతోంది. అత్యధికంగా బిహార్‌లో 39 ఇనాక్టివ్ కంపెనీలు ఉన్నాయి.
News February 19, 2026
ప్రేయసితో ❤️ పెళ్లికి సిద్ధమైన ధవన్.. ఫొటోలు వైరల్

IND మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ప్రేయసి సోఫీ షైన్(ఐర్లాండ్)తో పెళ్లికి సిద్ధమయ్యారు. నిన్న సంగీత్ వేడుకల ఫొటోలను SMలో షేర్ చేయగా వైరలవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వివాహం జరగనున్నట్లు సమాచారం. కాగా AUSకు చెందిన ఆయేషాను ధవన్ 2012లో వివాహం చేసుకొని 2023లో విడాకులు తీసుకున్నారు.
News February 19, 2026
రూ.20 లక్షల ఉద్యోగం వస్తేనే అభిషేకం.. విద్యార్థి లేఖ వైరల్

AP: ఏలూరు(D) తాడువాయిలోని శ్రీభద్రకాళి వీరేశ్వరస్వామి ఆలయ హుండీలో ఓ విద్యార్థి వేసిన లేఖ వైరలవుతోంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో తనకు 9CGPA మార్కులు, తర్వాత ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరాడు. అప్పుడు అభిషేకం చేయించి బట్టలు ఇస్తానని లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఈ కుర్రాడు దేవునితో డీల్ మాట్లాడుకున్నాడంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


