News February 11, 2025

తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.18,59,854 ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News February 25, 2026

భద్రాద్రి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

image

భద్రాద్రి జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. 37 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 9,685మంది విద్యార్థులకు గాను 9,210 మంది (95.09%) హాజరైనట్లు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. జనరల్ విభాగంలో 7,973 మందికి 7,683 మంది, వొకేషనల్ విభాగంలో 1,712 మందికి 1,527 మంది హాజరయ్యారు. మొత్తం 475 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News February 25, 2026

జనగామ: రేపటి నుంచి స్టెమ్ వర్క్‌షాప్

image

ధర్మకంచ ZPHSలో పాఠశాలలో రేపటి నుంచి రెండు రోజుల స్టెమ్ అడ్వాన్స్ వర్క్‌షాప్ ప్రారంభమవుతుందని ప్రోగ్రాం ఆఫీసర్ గట్టు రమేశ్ తెలిపారు. రోబోటిక్స్, ఏరోడైనమిక్స్, స్పేస్ సైన్స్ రంగాల్లో 12 మంది టెక్నికల్ నిపుణులు శిక్షణ అందిస్తున్నారు. మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన 250 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన పెంపొందించడం ఈ వర్క్ షాప్ లక్ష్యమని అన్నారు.

News February 25, 2026

HYD: ఇంట్లో చిరాకులు.. బయటే హాయిగా ఉంది!

image

‘మా వాళ్లతో మాట్లాడితే గొడవే అవుతుంది’.. ఇది యువత మాట. ఇంట్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం యువతను ఒంటరి చేస్తోంది. పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం, నిరంతరం విమర్శించడంతో ఇంటికి వెళ్లాలనే ఉత్సాహం చచ్చిపోతోంది. SMలో లోకాన్ని వెతుక్కుంటూ ఇంట్లో వాళ్లకు ముఖం చాటేస్తున్నారు. ఈ ‘అవాయిడెన్స్ కోపింగ్’ వల్ల యువత తమ ఇంటి కంటే బయటి ప్రపంచాన్నే, ఫ్రెండ్స్ గ్రూపులనే తమ అసలైన ఇల్లుగా ఫీలవుతున్నారట.